Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి వైఫల్యానికి సాంకేతికతే కారణం

bs

రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) అమలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబ ర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) వ్యాపారంపై ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం ప్రతిస్పందించిన వారిలో 59 శాతం మంది జిఎస్‌టిఎన్ పోర్టల్ సామర్థంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా పాత పరోక్ష పాలన నుంచి వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి)కి మారడంలో సాంకేతికపరంగా విఫలమైనట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధి యా శుక్రవారం తొలిసారిగా అంగీకరించారు. ఆయన వ స్తు,సేవల పన్ను యంత్రాంగం(జిఎస్‌టిఎన్)ను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం,పన్ను చెల్లింపుదారులు, ఇతర సంబంధితులకు సాయపడ్డానికే ఈ ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేశారు. జిఎస్‌టిఎన్ వద్ద ఉ ద్యోగులు సరిగ్గానే పనిచేశారని అన్నారు. ‘గడువు కాలంలోగా అమలుచేయాలన్న తొందరపాటుతో పనిచేయడం వల్ల ఎక్కడో పొరపాటు జరిగింది. సాంకేతికత విఫలమైందే తప్ప జిఎస్‌టిఎన్ కోసం పనిచేసినవారేమి విఫలం కాలేదు. జిఎస్‌టిఎన్ పోర్టల్‌లో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారు. వారి కృషి మామూలుది కాదు. ఇప్పటికీ జిఎస్‌టిఎన్ పోర్టల్ మమ్మల్ని విఫలులని చేస్తోంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఫిక్కీ తన కార్యాలయంలో ఏరాటు చేసిన ‘వన్ ఇయర్ జర్నీ ఆఫ్ జిఎస్‌టి’ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు.
గత కొన్ని నెలలుగా రూ. 2000 కోట్ల వస్తు,సేవల ప న్ను(జిఎస్‌టి)ని ఎగవేసినట్లు పరోక్ష పన్నుల శాఖ కనుగొందని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు(సిబిఐసి) సభుడు జాన్ జోసఫ్ ఈ సమావేశంలో తెలిపారు. జిఎస్‌టి పరిశోధన విభాగానికి డైరెక్టర్ జనరల్ కూడా అయిన జోసఫ్ జిఎస్‌టిని ఎగవేయడానికి, ఐటిసిని పొందేందుకు నకిలీ ఇన్‌వాయిస్‌లను కూడా జతచేశారని, వినియోగదారుల నుంచి కోసుకున్న పన్నును ప్రభుత్వానికి జమా చే యలేదని ఆయన వివరించారు. ప్రతినెల గడువులోగా 1.15 కోట్ల పన్ను చెల్లింపుదారుల్లో 30 శాతం మంది ఫైళ్లను దాఖలు చేయలేదని తెలుస్తోంది. రిటర్నులు దాఖ లు చేసే వారి సంఖ్య పెరిగినప్పటికీ ఎగవేసేవారి సంఖ్య కూడా ఎక్కువగాను ఉన్నట్లు సమాచారం. సిబిఐసి సభ్యు డు మహేందర్ సింగ్ ‘ఇవే బిల్లు విధానం ఓ సై లెంట్ విప్లవం’ అన్నారు. ఇదివరలో ట్రక్కు డ్రైవర్లకు వా రంలో రూ. 15,000 ఖర్చయ్యేదని, కానీ జిఎస్‌టి విధానంలో అది రూ. 4000కు పరిమతమైందని, లంచాలను చాలా వరకు ఈ విధానం నిలువరించిందని, రూ. 50,000కు మించి రవాణా అయ్యే సరుకుకు ఇవే బిల్లు తప్పనిసరని, పన్ను రిటర్నులు, అమ్మకాల నివేదికల ప్రకారం క్రాస్ చెక్ చేసి ఎక్కడ తేడా ఉందో కనుగొంటామన్నారు.

Comments

comments