Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రిలయన్స్ జియోకు ఊరట

  • ఉచిత ఆఫర్ నిలుపుదలకు నిరాకరణ
  • పునః పరిశీలించాలని ట్రాయ్‌కు టిడిశాట్ ఆదేశాలు

Mukesh-Ambani-Jio

న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఉచిత ప్రమోషనల్ సేవల ఆఫర్‌ను పునఃపరిశీలించాలని టిడిశాట్ (టెలికామ్ డిస్పూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పల్లేట్) తాజాగా ట్రాయ్‌ను ఆదేశించింది. రెండు వారాల్లో సమాధానమివ్వాలని సూచిం చింది. అయితే రిలయన్స్ జియో అందించే ఉచిత ఆఫర్లపై స్టే విధించడానికి మాత్రం టెలికాం ట్రిబ్యునల్ నిరాకరించింది. 90 రోజుల ప్రమోషనల్ ఆఫర్ దాటిన తర్వాత కూడా హ్యాపీ న్యూ ఇయర్  పేరిట జియో ఉచిత ఆఫర్‌ను కొనసాగించడం.. దీనికి ట్రాయ్ కూడా అనుమతి ఇవ్వడాన్ని ప్రత్యర్థి టెలికామ్ సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ వ్యతిరేకించాయి. ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్ణయంపై ఈ ఇరు సంస్థలు టెలికామ్ ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించాయి. ఉచిత డాటా, కాల్స్ ఆఫర్‌ను జియో తక్షణమే ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని ఇరు సంస్థలు కోరాయి.  ప్రత్యర్థి సంస్థలకు ఈ విష యంలో ఊరట లభించలేదు.  జియో ఉచిత సేవల నిలిపివేతకు నిరాకరించిన టెలికామ్ ట్రిబ్యునల్ నిరాకరించింది. అయితే ఆ ఆఫర్లను కొనసాగించు కునేలా ఆపరేటర్‌కు ఇచ్చిన జనవరి 31 నాటి అనుమతిని పునఃపరిశీలించాలని ట్రాయ్‌ను ఆదే శించింది. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత ఆఫర్లపై స్టే విధించాలని కోరుతూ టెలికాం కంపెనీ లు వేసిన మధ్యంతర పిటిషన్‌పై ఆదేశాలను ట్రిబ్యునల్ రిజర్వులో పెట్టిన విషయం తెలిసిందే.  గతేడాది సెప్టెంబర్ నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ప్లాన్ ను కస్టమర్లకు అందిస్తోంది. డిసెంబర్ లో మళ్లీ తమ ఉచిత సర్వీసులను 2017 మార్చి 31 వరకు పొడిగించింది. జియో ఉచిత ఆఫర్‌ను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన ట్రాయ్ తీరు పై ఆగ్రహించిన టెలికాం కంపెనీలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. జియో ఉచిత కాలింగ్, డేటా ప్లాన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘన కంపెనీ చేయడం లేదని టెలికామ్ నియంత్రణ సంస్థ ట్రాయ్ క్లీన్ చీట్ ఇచ్చింది. జియో వెల్ కమ్ ఆఫర్ కు, హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కు తేడా ఉందని ట్రాయ్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Comments

comments