Home తాజా వార్తలు సబిత ఇంద్రారెడ్డితో తీగల భేటీ

సబిత ఇంద్రారెడ్డితో తీగల భేటీ

Sabitha

 

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. ఎప్పటిలాగానే కాంగ్రెస్ నుంచి కొందరు ఎంఎల్‌లు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మహేశ్వరం ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు సమాచారం. సబితా తన కుమారులు కార్తీక్, కౌళిక్‌లతో కలిసి సిఎం కెసిఆర్ కలిసిన విషయం తెలిసిందే. మార్చి-20 లోపు ఆమె టిఆర్‌ఎస్ చేరుతారని ఉహాగహనాలు వస్తున్నాయి. గురువారం ఉదయం మాజీ ఎంఎల్‌ఎ తీగల కృష్ణారెడ్డి, సబిత ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తీగెల కృష్ణా రెడ్డిపై సబిత ఘన విజయం సాధించిన విషయం విధితమే. సబిత తీగలతో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్ సభ ఎన్నికలలోపు పది మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టిఆర్‌ఎస్ లో చేరనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

 

Teegala Krishna Reddy Meet with Sabitha Indra Reddy