Search
Sunday 23 September 2018
  • :
  • :

బాలుడిపై యువకుడు లైంగిక దాడి

teenage-raped-on-4-year-boy

లక్నో: యుపిలో మరో దారుణ సంఘటన జరిగింది. రాష్ట్రంలోని షామ్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన మొబైల్‌లో చిత్రీకరించాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే… కైరానా పట్టణానికి చెందిన ఇందర్ కుమార్(21) తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలుడిని చాక్లెట్ ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకాన్ని వీడియో తీశాడు. అయితే, బాధిత బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Teen Caught Raping 5-year-old Boy in Uttar Pradesh.

Comments

comments