Search
Sunday 23 September 2018
  • :
  • :

సర్టిఫికెట్లు తడిసిపోయాయని యువకుడు సూసైడ్!

Kerala Teen committed suicide after rains destroy school certificates

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే వర్షం కాస్త తగ్గుముఖం పడుతోంది. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న జనాలు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి సర్టిఫికెట్లు తడిసిపోయాయని, తాను ఇక ఉన్నత చదువులు చదవలేననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వరద పొటెత్తడంతో పునరావాస కేంద్రానికి వెళ్లిపోయిన అతడి ఫ్యామిలీ తిరిగి నివాసానికి చేరుకుంది. అయితే, ఇంటికి వచ్చిన విద్యార్థికి అతడి సర్టిఫికెట్లు వర్షపు నీటికి తడిసి ముద్దవడం కనిపించింది. దీంతో తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కోజికోడ్ జిల్లాలోని కరంతూరులో సోమవారం జరిగింది.

Comments

comments