Search
Wednesday 14 November 2018
  • :
  • :

చిరంజీవి ముఖ్య అతిథిగా పాటల వేడుక

sai

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ సినిమా పొస్ట్‌ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి రొమాంటిక్ మూవీస్‌ను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మంచి లవ్ ఫీల్‌తో సాగే ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. గోపీసుందర్ సంగీత సారధ్యంలో సినిమా పాటలు విడుదల కానున్నాయి. ఈనెల 9న హైదరాబాద్ జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనున్న ఈ ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, పృథ్వీ, సురేఖావాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలుః రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్, గోశాల రాంబాబు, స్టంట్స్‌ః వెంకట్, ఎడిటర్‌ః ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్‌ః సాహి సురేష్, సినిమాటోగ్రఫీః ఆండ్రూ.ఐ, మాటలుః డార్లింగ్ స్వామి.

Comments

comments