Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘తేజ్ ఐ లవ్ యు’ సెన్సార్ పూర్తి

Tej I Love You Trailer out now

హైదరాబాద్: ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’.  తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి ఎలాంటి కత్తిరింపులు లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్‌ ఇచ్చారు. సాయి సరసన అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్‌ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్స్, టీజర్, ఆడియో, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. డైరెక్టర్ కరుణాకరన్ మరోసారి తనదైన శైలిలో క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించాడని, అలాగే చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. ఈ నెల‌ 6న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments