Home సినిమా మంచి భవిష్యత్తు ఉన్న హీరో తేజు

మంచి భవిష్యత్తు ఉన్న హీరో తేజు

sai

సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాం డ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ “20 ఏళ్లుగా కరుణాకరన్ లవ్ మెజీషియన్‌గా ఉంటూ ప్రేమ కథా చిత్రాలే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నా కెరీర్‌లో ముఖ్యమైన ఈ చిత్రాన్ని కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించడం ఆనందంగా ఉంది”అని అన్నారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ “ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి 11 మంది హీరోలున్నారు. అందరూ క్రమశిక్షణతో ఉన్నారంటే కారణం అల్లు అరవింద్ ప్లానింగే. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం సాయిధరమ్‌తేజ్. కరుణాకరన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించడమే కాదు మ్యూజి క్ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహించాడు”అని పేర్కొన్నారు. అ ల్లు అరవింద్ మాట్లాడుతూ “నేను చిరంజీవితో కలిసి ముందుగా సినిమాలు నిర్మించినా… కె.ఎస్.రామారావు ప్ర యాణం కూడా చిరంజీవితోనే ప్రారంభమైంది. మా ఫ్యామిలీకి, కరుణాకరన్‌కు మంచి అనుబంధం ఉంది.ఈ సినిమా ట్రైలర్‌ను చూశా ను. చాలా బావుంది. తేజు మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. హీరోగా ఎదగడానికి, వాళ్ల అమ్మ కళ్లలో ఆనందం చూడటానికి తను పడ్డ కష్టమేంటో నాకు తెలుసు. మంచి భవిష్యత్తు ఉన్న హీరో అతను”అని తెలిపారు. ఎ.కరుణాకరన్ మాట్లాడుతూ “తొలిప్రేమ సినిమా నుండి ఈ రోజువరకు నేను చేసిన ఈ ప్రయాణంలో నా హీరోలు, నిర్మాతలు ఎంతగానో సహకరించారు. వారులేకుంటే నేను లేను. తక్కువ సినిమాలే చేసినా పెద్ద నిర్మాతలతో సినిమాలు చేయడంతో ఆనందపడుతున్నాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వనీదత్, చాముండేశ్వరినాథ్‌తో పా టు చిత్ర బృందం పాల్గొంది.