Home తాజా వార్తలు ‘తేజ్ ఐ లవ్ యూ’ మూవీ (టీజ‌ర్)

‘తేజ్ ఐ లవ్ యూ’ మూవీ (టీజ‌ర్)

Tej I Love You Teaser Released

హైదరాబాద్: మెగా మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌, ప్రేమ కథ చిత్రాల దర్శకుడు క‌రుణాక‌ర‌న్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘తేజ్ ఐ ల‌వ్ యూ’. మంగళవారం ఈ మూవీ టీజర్ ను మేడే సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసింది. టీజర్ ను డైరెక్టర్ క‌రుణాక‌ర‌న్ తనదైన శైలిలో ఫీడ్ గుడ్ లా చూపించారు. తేజూ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కథనాయికగా చేస్తోంది. చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై సీనియర్ నిర్మాత కెఎస్‌ రామారావు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇదే నెలలోనే మూవీ విడుదల కానుందని సమాచారం.