Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

‘తేజ్ ఐ ల‌వ్ యూ’ ట్రైలర్‌ చూశారా..?

Tej I Love You Trailer out now

హైదరాబాద్: ప్రేమ కథ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ’. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ కరుణాకరన్ మరోసారి తనదైన శైలిలో క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించాడని అర్థమవుతోంది. తేజ్ నటనతో పాటు కథనాయికగా చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్స్, టీజర్, ఆడియో మూవీ అంచనాలను పెంచేసిన విషయం విదితమే. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఈ అంచనాలు తారస్థాయికి చేరాయి. దీంతో మెగా అభిమానులు ఈ సినిమా తేజూకి తప్పక హిట్ ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది.

Comments

comments