Home సినిమా ‘ఎన్టిఆర్’ బయోపిక్ నుంచి తప్పుకున్న తేజ

‘ఎన్టిఆర్’ బయోపిక్ నుంచి తప్పుకున్న తేజ

ntr

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘ఎన్టిఆర్’ బయోపిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని డైరెక్టర్ తేజ బుధవారం మీడియా ద్వారా తెలియజేశాడు. ‘ నేను ఎన్టిఆర్‌కు వీరాభిమానిని. ఈ సినిమాకు న్యాయం చేయలేనేమోనని అనిపిస్తోందని.. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటునన్నానని’ తేజ పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎన్టిఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం చిత్ర నిర్మాతు బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్‌ను సంప్రదించినట్లు సమాచారం. కాగా, ఎన్టిఆర్ చాలా మంది సినీ తారలతో కలిసి వెండితెరను పంచుకున్న నేపథ్యంలో ఆయా పాత్రలల్లో ఎవరెవరు నటిస్తున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.