Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

3 గంటలు ఆలస్యమైనా.. గమ్యానికి నిమిషం ముందే…

Tejas-Train

ముంబయి: గోవాలోని కర్మలీ స్టేషన్ నుంచి తేజాస్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా బయలు దేరడంతో అదెప్పుడు చేరుతుందా అని ఎదురు చూసిన ప్రయాణికులకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు నిమిషం ముందుగానే చేరి  ఆశ్చర్యపరిచింది. గరిష్ఠంగా గంటకు  200 కి మీ. వేగంతో పరుగులు తీసే సామర్థం ఉన్న తేజాస్ ఎక్స్‌ప్రెస్ గోవా నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి  750 కిమీ ప్రయాణించి రాత్రి  7.44కు ముంబయి చేరుకుంది. సాధారణంగా ఆ రైలు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి రాత్రి 7.45 గంటలకు ముంబయి చేరుకోవడం పరిపాటి. తేజాస్ ఎక్స్‌ప్రెస్ తొలి ప్రయాణం ఇది.

Comments

comments