Home తాజా వార్తలు మహా కూటమి అభ్యర్థికి చెందిన రూ. 3.59 కోట్లు సీజ్

మహా కూటమి అభ్యర్థికి చెందిన రూ. 3.59 కోట్లు సీజ్

 

వరంగల్: క్రాంగెస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు చెందిన రూ.3.59 కోట్ల రూపాయలను తాము సీజ్ చేశామని వరంగల్ సిపి రవీందర్ తెలిపారు. పగిడిపాటి దేవయ్య వర్ధన్నపేట నియోజక వర్గంలో మహా కూటమి నుంచి పోటీ చేస్తున్నారని పోలీసుల వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  మేడ్చల్ జిల్లా ఉప్పల్ కు చెందిన ఫాతిమా రెడ్డి గత రాత్రి కాజీపేటలోని ఫాతిమానగరంలో తిరుగుతుండగా పోలీసులు అనుమానం వచ్చి పట్టుకున్నారు. నిందితుడు  ఫాతిమా రెడ్డి బ్యాగులో మూడన్నర కోట్ల రూపాయలను గుర్తించారు.

వర్ధన్న పేట యోజకవర్గంలోని వివిధ గ్రామాలకు ఆ డబ్బును పంపుతున్నట్టు ఆయన దగ్గర కాగితాల రూపంలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. దేవయ్య అల్లుడు సందీప్, కాంగ్రెస్ నేత అమృత రావు, ఫాతిమా రెడ్డి  స్నేహితులని పోలీసుల దర్యాప్తులో తేలింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సిపి రవీందర్ తెలిపారు. ఫాతిమా రెడ్డిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని సిపి వెల్లడించారు.

 

Telagnana Elections: RS 3.5 Crores Seized in Warangal, Congress Candidate Devaiah Follower Fatima Reddy Send 3.5 Crores Money to VardannaPeta