Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మట్టి మనుషులు బంధూకులు పట్టిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకటరెడ్డి డిమాండ్
CPIమన తెలంగాణ/కరీంనగర్: మట్టి మనుషులు బంధూ కులు పట్టిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిదేన ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. అధికారంలోకి రాకముందు ఈ పోరాట స్ఫూర్తిని కీర్తించి న సిఎం కె. చంద్రశేఖర్ రావు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలో మౌనం వహిస్తున్నారని ఆయన విచా రణ వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరా ట వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ జి ల్లాలో స్థానిక అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం వద్ద ఏ ర్పాటు చేసిన సభలో చాడ మాట్లాడారు. తెలంగాణ స్వా తంత్య్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించని ప క్షంలో నేటి పాలకులు కూడా గత ప్రభుత్వాల మాదిరి గానే చరిత్రను కనుమరుగు చేసిన వారవుతారన్నారు. నిజాం సంస్థానంలో ఉంటూ విముక్తి చెందిన మహారాష్ట్ర లోని ఐదు జిల్లాలు, కర్ణాటకలోని మూడు జిల్లాల్లో విమో చన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న విషయం మరవొద్దన్నారు. ప్రపంచ చరిత్రలోనే మహాత్తరమైన ఈ పోరాటాన్ని కొందరు గుర్తించడానికి ని రాకరిస్తున్నారని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీరులను స్మరించుకుంటూ..
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న నల్లగొండ జిల్లా యాదాద్రిలో ప్రారంభమైన బస్సు యాత్ర ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా బుధవారం కరీంనగర్ చేరుకుంది. తొలి రోజు హుస్నాబాద్ మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర చిగురుమామిడి, తిమ్మాపూర్, కరీంనగర్, సుల్తా నాబాద్, పెద్దపల్లి మీదుగా 120 కిలోమీటర్ల దూరం ప యనించి గోదావరిఖని చేరుకుంది. తొలుత హుస్నాబాద్ మండల కేంద్రంలో సాయుధ పోరాటంలో అమరుడైన అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాల వేయడం ద్వారా యాత్ర ప్రారంభమైంది. అక్కడ పేదల కోసం పో రాడి అసువులుబాసిన యోధుల్ని స్మరించుకుంది. అనం తరం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి, చిగురు మామిడి మీదుగా యాత్ర తిమ్మాపూర్ మండలం కొత్తప ల్లి గ్రామం చేరుకుంది. ఈ గ్రామంలో పార్టీ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కారదర్శి చాడ వెంకట రెడ్డి అవిష్కరించారు. యాత్ర అ ల్గునూర్ గ్రామం చేరుకోగానే పార్టీ పతాకాలు చేతబూనిన కార్యకర్తలు పెద్దసంఖ్యలో యాత్రకు స్వాగ తం పలికారు. అనంతరం కరీంనగర్ బైపాస్ వద్ద బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన చాడ వెంకటరె డ్డి అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం వరకు ద్విచక్ర వాహ నంపై ప్రదర్శనగా వెళ్లారు. యాత్రలో సిపిఐ జిల్లా కార్య దర్శి కోమటి రెడ్డి రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ, నాయ కులు ఎన్. జ్యోతి, ఆర్. శివరామ కృష్ణ, రాములు యాదవ్, పల్లె నర్సింహ, ఉప్ప లయ్య, అనిల్ కుమార్. రాజు, నర్సయ్య యాదవ్, కె. మ ణికంఠ రెడ్డి, పంజాల శ్రీనివాస్, సమ్మయ్య, ఆశోక్, పి కేధారి, సృజన్ కుమార్, జి. మల్లేశ్ తదితరులున్నారు.

Comments

comments