Home తాజా వార్తలు మా అభ్యర్థులు వీరే

మా అభ్యర్థులు వీరే

ఇద్దరు మినహా సిట్టింగ్‌లందరికీ టికెట్లు

TRS-Party-Candidates

మన తెలంగాణ : శాసనసభ రద్దు అయిన వెంటనే తెలంగాణ రాష్ట్ర అపధ్దర్మ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇద్దరు సిట్టింగ్ ఎంఎల్‌ఎలకు టికెట్ నిరాకరించారు. ఆంధోల్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ బాబుమోహన్ స్థానంలో జర్నలిస్టు చంటి క్రాంతి కిరణ్‌కు, చెన్నూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎంఎల్‌ఎ నల్లాల ఓదేలు స్థానంలో ప్రస్తుతం ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు టికెట్లు కేటాయించారు. మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, చొప్పదండి, వరంగల్(ఈస్ట్) నియోజకవర్గాల సిట్టింగ్ అభ్యర్థులను టికెట్లను పెండింగ్‌లో ఉంచారు. అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, చార్మినార్, మలక్‌పేట, కోదాడ, హుజూర్‌నగర్, జహీరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.Telangana-Ministersటికెట్ల కేటాయింపుల్లో కెసిఆర్ మార్కు కొందరికి కెసిఆర్ షాక్ ఇవ్వగా, టికెట్ రాదనుకున్న మరికొందరికి టికెట్లను కేటాయిస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసమ్మతి నేతల గొంతుల్లో వెలక్కాయ పడ్డటయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు గాను చొప్పదండి మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను టిఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు అనుకున్నట్టుగానే చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. మొదటి నుంచి వివాదాస్పదంగా పేరు తెచ్చుకున్న చొప్పదండి ఎమ్మెల్యే బోడిగె శోభ అభ్యర్థిత్వాన్ని కెసిఆర్ పెండింగ్‌లో పెట్టారు. ఆమెకు ఈ సారి టికెట్ కేటాయించవద్దంటూ నియోజకవర్గానికి చెందిన కొందరు టిఆర్‌ఎస్ నాయకులు సిఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో శోభకు అధినాయత్వం షాక్ ఇచ్చింది. సోమారపు సత్యనారాయణ, వేములవాడ రమేష్‌బాబుకు టికెట్ ఇవ్వొదంటూ స్థానిక నాయకులు అధిష్టానికి ఫిర్యాదు చేసినా, కెసిఆర్ సర్వే రిపోర్టుల ఆధారంగా వారిద్దరికి టికెట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో టిఆర్‌ఎస్ అసమ్మతి వాదులకు మింగుడుపడడం లేదు. చాలావరకు సర్వే రిపోర్టుల ఆధారంతో పాటు వారి పనితీరును గుర్తించిన కెసిఆర్ టికెట్లను కేటాయించినట్టు వినికిడి.

ఈసారి మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రస్తుతానికి వేరే వారికి ఆ టికెట్‌ను కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఈ టికెట్‌ను ఆశించే వారిలో కిచ్చెన్నగారి లకా్ష్మరెడ్డి, ఉప్పల్ మాజీ కార్పొరేటర్ హరివర్థన్ రెడ్డి తదితరులు ఉన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు పేరు ప్రకటించకపోవడానికి కారణం అనారోగ్యమేనని తెలుస్తోంది. అక్కడ ఓ డాక్టర్‌ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. కొడంగల్ రేవంత్‌రెడ్డిపై పోటీ చేయడానికి పట్నం నరేందర్‌రెడ్డి అవకాశం ఇస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు ఉప్పల్ అభ్యర్థిగా భేతి సుభాష్‌రెడ్డి, నాంపల్లి ఆనంద్‌గౌడ్‌లకు తదితరులకు కెసిఆర్ అవకాశం కల్పించారు.

16 మందితో టిఆర్‌ఎస్ మేనిఫెస్టో  కమిటీ

మన తెల౦గాణ/ హైదరాబాద్  వచ్చే ఎన్నికల కోస౦ టిఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో కమిటీని ప్రకటి౦చి౦ది. పార్టీ పార్లమెంటరీ లీడర్ కె.కేశవరావు అద్యక్షతన 15 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో టిఆర్‌ఎస్ పార్టీ లోక్ సభ నాయకుడు జితేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు జీ.నగేష్, రోడ్లు భవనాల శాఖ ఆపద్దర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేంద్ర, నీటిపారుదల శాఖ ఆపద్దర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు, వెద్యుత్తు శాఖ ఆపద్దర్మ మంత్రి జగదీశ్వర్రెడ్డి, పశుసంవర్ధక శాఖ ఆపద్దర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పర్యాటక శాఖ ఆపద్దర్మ మంత్రి అజ్మీర చందూలాల్, ఎక్సైజ్ శాఖ ఆపద్దర్మ మంత్రి పద్మారావు గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ రెడ్డి, మండలి విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్, మాజీ మంత్రి పి.రాములు మాజీ పార్లమెంట్ సభ్యుడు గుండు సుధారాణి సభ్యులుగా ఉన్నారు.