Home తాజా వార్తలు అక్టోబరు 10 వరకు అసెంబ్లీ సమావేశాలు

అక్టోబరు 10 వరకు అసెంబ్లీ సమావేశాలు

ASSEMBLY1హైదరాబాద్ : ఈనెల 29వ తేదీ నుంచి అక్టోబరు 10వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మధ్యలో అక్టోబరు 2,3,4 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ప్రతిపక్షాలు కోరితే మళ్లీ 10న బిఎసి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సభ జరుగుతుంది. అవసరమైతే ప్రతి రోజు సాయంత్రం వరకు చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.