Home రాష్ట్ర వార్తలు ఆశావహ అంకెలు

ఆశావహ అంకెలు

  • భారీ బడ్జెట్ ప్రతిపాదనల్లో తప్పు లేదు, కొత్త తరహాలో ఆర్థిక నిర్వహణ, అమర్తసేన్ ఆదర్శంగా సంక్షేమం
  • ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానంలో సిఎం కెసిఆర్
  • బిసిల కోటా పెంపుపై కమిషన్‌ను నివేదిక కోరాము
  • ముస్లింలకు అమల్లో ఉన్న వాటినే పెంచదలిచాం
  • విద్యుత్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు

CM-KCR

హైదరాబాద్ : బడ్జెట్ ప్రతిపాదన ల్లో అంకెలను ఎక్కువ చేయడంలో ఎలాంటి తప్పు లేదని, అది ఆశావహక ధృక్పథానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రేశేఖరరావు సమర్థించుకు న్నారు. రాష్ట్రంలో కొత్త తరహాలో ఆర్థిక నిర్వహణ చేస్తున్నామని, సంక్షేమ రంగంలో అమర్తసేన్, నిధుల సమీకరణకు దీపక్ పరేఖ్ నమూనాలను అనుసరిస్తూ ఫలితాలు సాధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో సోమవారం ద్రవ్య విని మియ బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధాన మిచ్చారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా కూడా అప్పులు తీసుకోకుండా కార్యక్రమాలను చేపట్టడం లేదని, అభివృద్ధి, సంక్షేమం కోసం అర్హతలు ఉండీ, రుణాలు తీసుకోకపోవడం నేరంగా పరిగణిస్తార న్నారు. ఈ ఏడాది రూ.20 వేల కోట్ల అప్పు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పారు. అంచనాలను ఎక్కువగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని, వచ్చే సంవ త్సరంలో రాష్ట్ర రాబడి రూ.18 వేల నుంచి 25 వేల కోట్ల వరకు పెరిగే అవకాశముందన్నారు. దేశం లోని ఇతర రాష్ట్రాలు బడ్జెట్ అంచనాల్లో ఏ మేరకు వాస్తవిక ఫలితాలు సాధిస్తున్నారో మన రాష్ట్రం కూడా దాదాపు అదే రీతిలో ఫలితాలు సాధిస్తోందని ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
బిసిలకు రిజర్వేషన్లు పెరగాలి : బిసిలకు రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని, ఎంత మేర పెంచాలన్న దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని బిసి కమిషన్‌ను కోరతామని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్ల విషయాన్ని మతపరమై నవిగా చూస్తున్నారని, కానీ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలనే ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. బిసి కార్పొరేషన్ కు నిధుల విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని, గత సంప్రదాయాలకంటే భిన్నంగా, ఆయా వర్గాల వారితోనే సమావేశమై, వారు కోరుకున్నట్లుగా నిధులను కేటాయి స్తామన్నారు. ఇందుకు సంబంధించిన బిసి ఎంఎల్‌ఎలతో ప్రత్యేకంగా సమావే శాన్నికూడా నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో వాట్ బకాయిలుగా రా వాల్సిన రూ.4000 కోట్ల వివాదాలను త్వరగా పరిష్కరించేలా చూడాలని హైకో ర్టు చీఫ్ జస్టిస్‌ను కోరనున్నట్లు సిఎం తెలిపారు.
విద్యుత్ సమస్యలపై కాంగ్రెస్ మాట్లాడటమా ?
విద్యుత్ రంగం గురించి కాంగ్రెస్ వారు మాట్లాడటం హాస్యాస్పదమని సిఎం విమర్శించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి విద్యుత్ సమస్యలు ఒక భయంకర సన్నివే శమని, దానిని అధిగమించడనికి రెంన్నరేళ్లలో చేసిన చిత్తశుద్ధితో పనులు చేసి ఫలితాలు సాధించామని సిఎం వివరించారు. కెజి టు పిజి విద్య విషయంలో ప్రతి పక్షాలు విమర్శలు తప్ప వాస్తవ కోణంలో ఆలోచించడం లేదని విమర్శించారు. పటిష్టమైన పునాదులతో కెజి టు పిజిను అమలు చేస్తామన్నారు, ఇది తన కలల ప్రాజెక్టు అని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయిలో దళిత యువతులకు హాస్టళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వివరించారు. ప్రాజె క్టులు పూర్తయితే రాజకీయంగా దెబ్బపడుతుందనే బాధతోనే కాంగ్రెస్ పార్టీ కేసు లు వేస్తోందని ఆరోపించారు. వచ్చే ఏడాది నుంచి రైతు రుణమాఫీ నిధుల కేటా యింపు భారం తగ్గనున్నందున 2018-19 లో ఎస్‌సి, ఎస్‌టి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. వెయ్యి నుంచి 1500 కోట్ల వరకు అదనంగా నిధులను కేటా యించుకోవచ్చని అన్నారు.
పంటల బోనస్‌పై అధ్యయనం చేస్తాం
వ్యవసాయం, రైతాంగానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చేయూత నిస్తున్నార ని, కర్నాటకలో బోనస్ ఇస్తున్నారన్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్‌లో భాగంగా గత రెండున్నరేళ్లలో 98 వేల హెక్టార్లకు విస్త రించామని అంకెలతో సహా వివరించారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. 50 శాతం సబ్సిడీ తో నూలు, రసాయనాలను అందించడమే కాకుండా, వారి నుంచి 100 శాతం వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.
నగరంలోని డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు, మత్తు మందుల అక్రమ విక్రయాలపై కఠి నంగా వ్యవహరించమని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలిచ్చినట్లు సిఎం చెప్పారు. ఈ కార్యక్రమాలకు ఊతమిస్తున్న వారిలో విదేశీయులు ఉన్నందున ,తొందరపా టు ప్రదర్శిస్తే అంతర్జాతీయ స్థాయిలో సమస్యలు వస్తాయన్న కోణంలో ప్రభుత్వం ఆచితూచి పక్కా ఆధారాలు లభించిన తరువాతనే చర్యలు తీసుకుంటోందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లులను మూజువాణీ ఓటుతో ఆమోదించిన అనంతరం, స్పీకర్ మధుసూదన చారి సభను నిరవధికంగా వాయిదా వేశారు.