Home తాజా వార్తలు సెప్టెంబరు 2న తెలంగాణ కేబినెట్ మీటింగ్.?

సెప్టెంబరు 2న తెలంగాణ కేబినెట్ మీటింగ్.?

Chief Minister KCR who is widely traveling in the state
హైదరాబాద్: సెప్టెంబర్ 2న టిఆర్ఎస్ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి నివేదన సభకు 2 గంటలు ముందుగా ఈ సమావేశాన్ని సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రగతిభవన్ లో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా జరగనున్న ఈ సమావేశానికి అధిక ప్రాధాన్యత సంతరించుకోనుంది. అయితే, ఈ భేటీ తర్వాత కొంగర కలాన్ లో జరగనున్న ప్రగతి నివేదన సభకు కెసిఆర్, మంత్రులు వెళ్లబోతున్నారు. కాగా, అప్పటికే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ఉంటాయి. రోడ్డు మార్గంలో మంత్రులు సభా స్థలిని చేరుకోవడం కష్టం కాబట్టి, బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కొంగర కలాన్ కు వెళ్లనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.