Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశంCM-Cabinet

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గ సమావేశమవుతోంది. ప్రగతి భవన్‌కు మంత్రులు, టిఆర్‌ఎస్ నేతలు, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ చేరుకున్నారు. మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహా రెడ్డి, హరీష్ రావు, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, చందూలాల్, జూపల్లి కృష్ణారావు, లక్ష్మా రెడ్డి, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. శాసన సభ రద్దుకు మంత్రవర్గం తీర్మానం చేయనున్నట్టు సమాచారం. రాజ్‌భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ నరసింహన్‌తో సిఎం కెసిఆర్ భేటీ అవుతారు. తెలంగాణ భవన్‌లో 2.30 గంటలకు మీడియాతో కెసిఆర్ మాట్లాడుతారు.

Comments

comments