Home తాజా వార్తలు జూపల్లి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ

జూపల్లి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ

Jupally Krishna Rao said that efforts are on to strengthen the local corporations

హైదరాబాద్: బుధవారం సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ కానుంది. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల అంశంపై అదనపు అడ్వకేట్ జనరల్, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది. పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం మించకూడదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సబ్ కమిటీ సమావేశం కావాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారు.