Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రముఖులు

Telangana Celebrities Visited the Tirumala Temple

తిరుమల : తిరుమల శ్రీవారికి తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎంపిలు జోగినపల్లి సంతోష్‌కుమార్,  బాల్క సుమన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర సహకార కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ ఉదయం విఐపి విరామ సమయంలో వారు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం వారికి ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు.

Telangana Celebrities Visited the Tirumala Temple

Comments

comments