Home తాజా వార్తలు ప్రజాస్వామ్యయుత పాలన

ప్రజాస్వామ్యయుత పాలన

BJRR4727

అందుకే ఆయనను తామంతా ‘లక్ష్మిపుత్రుడు’ అని చెప్పుకుంటున్నామన్నారు. తెలంగాణ ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు సిఎం తెలిపారు. ప్రతీ గ్రామంలో పరీక్షలను నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సర్వం సిద్ధం చేస్తుందన్నారు. తాను ఒక చిన్న గ్రామాన్ని దత్తత తీసుకొని కంటి పరీక్షలు చేయిస్తే అందులో 220 మంది కంటి సమస్యలున్నట్లు వెల్లడైందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత కంటి వెలుగుకు సంబంధించి తేదీలు ఖరారవుతాయని తెలిపారు. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ధ్యాన్ క్యూర్’ అన్నట్లు విదేశాల్లో ప్రతి ఒక్కరూ ఏడాదికొకసారి పరీక్షలు చేయించుకుంటారని, రాష్ట్రంలో పేదరికం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వమే ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ పేరుతో ప్రతీ ఒక్కరికీ ఏటా పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులను అందజేయనుందన్నారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటికి మంచి డిమాండ్ ఉందని ఈ సంఖ్యను వందకు పెంచినా కూడా డిమాండ్ ఉంటుందన్నారు. వీటిని చేయాలనే ఆలోచన లేనివారు, చేసేవాళ్ళపై అవాకులు, చెవాకులు పేల్చుతున్నారని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరముందని సూచించారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలని, అదే మనం నిర్దేశించుకున్న లక్షమన్నారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుంటే ఎక్కడ చూసినా రాష్ట్రం ఆకుపచ్చగా కనిపించాలని, అదే ‘బంగారు తెలంగాణ’ అని అన్నారు. ఇక నుంచి భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు ఆన్‌లైన్‌లో జరుగుతాయని, రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రోజు కూడా కార్యాలయం చుట్టూ తిరగకుండానే భూమి కొన్నవారి రికార్డులో వివరాలు నమోదై పేపర్లు (పట్టాదారు పాస్‌బుక్) నేరుగా ఇంటికి వస్తాయన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ పథకం త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. మహిళలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేశామని, దీనికి సారథ్యం వహిస్తున్న ఐపిఎస్ అధికారి స్వాతిలక్రా రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారన్నారు. పేకాట క్లబులు, గుడుంబాను అడ్రస్ లేకుండా చేశామన్నారు.
మత్సకారులకు మరబోట్లు
రాష్ట్రంలో మత్స పరిశ్రమ అభివృద్ధికి త్వరలో మత్సకారులకు వెయ్యి కోట్లతో మరబోట్లతో పాటు ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే చెరువుల్లో, వివిధ ప్రాజెక్టుల రిజర్వాయర్లలో చేపల పెంపకం జరుగుతోందని, ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసిందని అన్నారు. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ తనను అభినందించారని తెలిపారు. సంవత్సరానికి 13 నుంచి 15 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు తెలిపారు. మంత్రివర్గంలో మార్పులని, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30 శాతం మందికి సీట్లు రావనే ఇలాంటి వార్తలు వద్దన్నారు. సిట్టింగ్‌లో ప్రతి ఒక్కరికీ టిక్కెట్లు ఇస్తామన్నారు.