Home తాజా వార్తలు గవర్నర్‌తో సిఎం కెసిఆర్ భేటీ

గవర్నర్‌తో సిఎం కెసిఆర్ భేటీ

KCR will Go to Delhi Today
హైదరాబాద్: తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ సిఎం కెసిఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో సమావేశానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీ,అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో ఇప్పటికే రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.