Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఎంఎల్ఎల సస్పెన్షన్‌: రేపు హైకోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌

K.JANAREDDY

హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్ సెట్ తో శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో సభలో దాడికి దిగిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయగా, ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, డికె అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనచారి వెల్లడించారు. అయితే శాసనసభలో కాంగ్రెస్‌ ఎంఎల్ఎల సస్పెన్షన్‌, సభ్యత్వ రద్దుపై ఆ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. బుధవారం హైకోర్టులో కాంగ్రెస్‌ నేతలు పిటిషన్‌ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.

Comments

comments