Home తాజా వార్తలు గాంధీభవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు

గాంధీభవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు

Telangana Congress Leaders Meeting in Gandhi Bhavan

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల లొల్లితో కూటమి భాగస్వామ్య పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది. మహాకూటమి లో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీల మధ్య పంచాయతీ ఇంకా తేలకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ టికెట్ ఆశిస్తున్న నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్‌ను ఖానాపూర్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఇటీవల పార్టీలో చేరిన రమేష్ రాథోడ్‌కు టికెట్ ఇస్తే ఒప్పుకోమని కార్యకర్తలు హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడుతున్న అజ్మీరా హరినాయక్‌కు టికెట్ ఇవ్వాలని , టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి చేసుకుంటామని ఏడుగురు మండలాధ్యక్షులు హెచ్చరించారు.

Telangana Congress Leaders Meeting in Gandhi Bhavan

Telangana  News