Home దునియా దూరాలు పెరుగుతుంటే సంస్కృతీ మారుతుంది

దూరాలు పెరుగుతుంటే సంస్కృతీ మారుతుంది

BATUKAMMA

దూరం పెరిగినకొద్దీ ఊరు సంస్కృతి మారుతది. ఊరంటే మొత్తం కాదు ఆహారం, ఆహార్యం, ఇల్లు నిర్మాణం, వస్తువులు అన్ని కొద్దికొద్ది తేడాలుంటాయి. దోతులు కట్టే పద్ధతి ఊర్లె అందరికీ ఒక తీరుగ ఉండదు. దళిత బహుజన కులాలకు ఇతరులకు వేరు వేరుగనే ఉన్నారు. ఈ రెండు పద్ధతులు ఇంకో వంద కిలోమీటర్లు పోతే, ఇంకో పద్ధతి ఉంటది. కరీంనగర్ జిల్లాలో తెల్ల రుమాలు సుట్టుకుంటే పాత మెదక్ జిల్లాలో ఎర్ర గీతలున్న రుమాలు చుట్టుకుంటరు. ఆడవాల్ల్ల్లు చీర గోచి పెట్టుకునే పద్ధతి కరీంనగర్‌కు మెట్‌పల్లి ప్రాంతంలో వేరు వేరుగా ఉంటది. మెట్‌పల్లి కోరుట్లనే నిజామాబాద్ జిల్లాలో ఆడవాల్లు చీర గోచియో కాళ్ళ కిందకి తెచ్చి పైకి చెక్కుతరు. మిగతా ప్రాంతంలో మధ్య నుంచే ఉంటది. సిద్దిపేట ప్రాంతంలో శ్రమ జీవులైన మహిళలు ఆకువక్క ఎక్కువగా నములుతరు మిగితా ప్రాంతంలో అది కనపడది ఇది ఒకప్పటి ముచ్చట ఇప్పుడైతే చాలా మంది సాటు మాటుకు గుట్కతింటండ్రు.

కొన్ని ప్రాంతాలలో బియ్యం కొలుసుకునే సోల కుంచం ఆకారం ఒక తీరుగ ఉంటే మరో ప్రాంతంలో ఇంకో తీరుగ ఉంటది. బిందెలు చెంబులు ఇత్తడి వస్తువులు ఆకారం కూడా మారుతుంటది. ప్రక్కనున్న మహారాష్ట్ర సంస్కృతి ఆచారాలు ఇవతల పక్కన పడుతాయి. ఇంట్ల వస్తువు తయారీకీ కూడా అంగీలు కుట్టించ్చుకునే పద్ధతి కూడా వేరేవేరే ఉండేది. ఇప్పడైతై టైలర్లు సినిమాలల్ల సూచి సోకులుగా కుట్టుతున్నరు. కుండల తయారీ కూడా వేరువేరుగా అన్పిస్తది. కుండ ఆకారం రూపొందించడం ఆదిలాబాద్‌లో ఒక తీరుగ ఉంటే దక్షిణ తెలంగాణలో మరో తీరుగా ఉంటది. ఇల్లు నిర్మించే పద్దతులు కూడా కొన్ని ఊర్లల్ల రెండు సంకల సాయమాను వంటిల్లు రెండు అర్రలు గచ్చు ఉంటాయి. సరిగ్గ్గా ఇలాంటివే ఆ వూర్లో ఉంటయి. మరికొంత దూరంపోతే వీటి ఆకార నిర్మాణం ఇంకో తీరు కన్పిస్తది . ఇండ్ల ఆకారాలు వస్తువుల ఆకారాలు ఏఏ తీరుగ ఉంటాయన్న తీరు కండ్ల కట్టినట్టు రాయరాదు కాని దూరం దూరం సుట్టాలున్న వాల్లకు తెలుస్తుంది.

Batukamma

మాట్లాడే భాష కూడ వేరు వేరుగా సౌందర్యాత్మకంగా ఉంటది. మాట్లడేదంతా తెలంగాణయే. వాకిలిని ఒక దగ్గర అలికి అంటరు వడ్లను ఒడ్లు అంటరు. అన్ని పదాలు కలగల్సే ఉంటాయి. దీర్ఘాలు తీసుడు వేరు వేరుగ ఉంటది ఆంధ్ర తెలంగాణ కు ఉన్నంత పరక్ ఉండది గాని కొంత తేడా ఉంటది. భాగానే గాకూడా ఆహారపు అలవాట్ల్లు ఆహారంలో మార్పులు ఉంటయి. అటుకుల పోపు పెట్టే పద్దతి. ఉక్మ చేసే పద్దతి రొట్టెలు చేసే పద్దతులు బువ్వ వండి వార్చే పద్దతి వేరు వేరుగనే ఉంటది. సకెనాలు, గారెలు ముద్దగారెలు మలీల ముద్దలు సత్తు ముద్దలు చేసే పద్దతుల పెద్ద తేడా లేకున్నా మార్పులు కన్పిస్తవి.

బతుకమ్మ ఆడే పద్దతిలో మార్పు ఉంటాయి. వరంగల్, జనగాం ప్రాంతంలో ఆడవాల్లు పూర్తిగా వంగేలు కుంటే వలయాకారంలో ఆడితే కరీంనగర్ జాల్లాలో కొంచెం ఒక్కతీరుగా ఉన్నా ఆడే విదానంలో తేడా కన్పిస్తది. ఆట ఆడినంక తినే సద్దులు వేరు తీరు అన్పిస్తయి. ఎంత వేరువేరు అయినా పురాగ లెక్క అన్పియ్యదు. తెలంగాణ మనుషుల్లో ఆర్తి ఒక్క తీరే ఉంటది. అయితే ఇప్పుడు శ్రమ చేయించేసే వాళ్ల్ల వేరు వేరు తీరుగా ఉంటది. ఆ మాటకస్తే అన్నిట్లో కుల కులానికి కొన్ని తేడాలు కన్పిస్తాయి. ఆహారపు అలవాట్లలోనే తేడాలు ఉంటాయి.

Batukamma

కట్టుబాట్లులో తేడా కన్పిస్తది. ఇందులో వీల్లది మంచి వీల్ల కాదు. అనేది కాదు అన్నీ సంస్కృతికి సంబంధించినవే దేనికదే గొప్ప ఒకరిది తక్కువ అని మరొకటి ఎక్కువ అని కాదు. మొత్తానికి పల్లె సంస్కృతి గొప్పది ఎక్కడ వికాసం గొప్పది బతుకమ్మ పండుగ చప్పట్లు కొట్టుకుంట సుట్ట్టు ఎగురుతూ ఆట ఇప్పడు రాను రాను మాయమై కోలాటం జోరు అందుకున్నది. టెలివిజన్ మీడియాల వల్ల ఇతర ప్రాంతాల తొందరగా ఆకర్షణకు లోనయ్యే కల్చర్ మనకు సలువుగా అంటుకుంది.ఊర్లు ఊర్ల మనుషులు ఒక్కతీరు ఉన్నా సంస్కృతిలో స్వల్ప తేడాలుంటాయి. వెరసి అంతా తెలంగాణ పల్లె సంస్కృ తి అయితే ఈ కాలం లో ప్రపంచం ఒక్కటైన గ్లోబల్ సందర్భంలో పల్లె కూ పట్నం షోకులు వస్తున్నయి. దీంతో పల్లెటూరు వల్ల మనస్తత్వం మారుతుంది.

అన్నవరం దేవేందర్

94407 63479