Home తాజా వార్తలు కోర్టుకు హాజరైన కడియం

కోర్టుకు హాజరైన కడియం

Kadiyam-Srihari

వరంగల్ : తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణోద్యమ సమయంలో నిర్వహించిన రైల్‌రోకో కేసులో ఆయన ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ అక్టోబరు 3కు వాయిదా పడింది. కడియంతో పాటు బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.

Telangana DCM Kadiyam attending the court