Home తాజా వార్తలు ప్రజాభిమానంతోనే రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుంది: ఈటెల

ప్రజాభిమానంతోనే రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుంది: ఈటెల

Etela-rajenderహైదరాబాద్: గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా 1250 టిఎంసిలు ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మరో 150 టిఎంసిలకు పైగా మిగులు జలాల్లో రాష్ట్రానికి వాటా వస్తుందన్నారు. ప్రాజెక్టులు రీడిజైనింగ్‌తో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గోదావరి, కృష్ణా నదులు, ఉపనదులపై కర్ణాటక, మహారాష్ట్ర 400కు పైగా బ్యారేజీలు నిర్మించాయన్నారు. సాగునీటి రంగానికి రూ 25 వేల కోట్లు కేటాయించామన్నారు. 34,479 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ హబ్, హైదరాబాద్‌లో ఫార్మసిటీ, ఖమ్మంలో జిల్లాలో మెగా ఫుడ్ పార్క్, మెదక్ జిల్లాలో నిమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. 2016-17వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయం రూ 72,412.23 కోట్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. హైదరాబాద్‌లో సిసిటివి ఏర్పాటుకు రూ. 225 కోట్లు కేటాయించామన్నారు. బంజారాహిల్స్ పోలీస్ ట్విన్ టవర్స్‌కు రూ.140కోట్లు, పోలీస్ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ.70 కోట్లు, ఐటి, సమాచారముకు రూ.254 కోట్లు, ఆకస్మిక పరిస్థితుల నిర్వహణానికి రూ. 20 కోట్లు కేటాయించమన్నారు. 100 భారీ-మధ్యతరహా యూనిట్లతో రూ8491.66 కోట్ల పెట్టుబడులు పెట్టామన్నారు. 2014 జూన్ 1వరకు తెలంగాణ బంధించిన పులి లాంటిదని తెలిపారు. ఇప్పుడు సంకెళ్లు తెంచుకుని సొంత రాష్ట్రంగా అవతరించిదన్నారు. దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలో మనం కూడా ఉన్నామన్నారు. అభివృద్ధి కంటే సుపరిపాలనే ఎక్కువ దోహదపడుతుందన్నారు. వనరులకు తోడు తెలంగాణకు ఉన్న బలమైన నాయకత్వం, సుపరిపాలన, అంతులేని ప్రజాభిమానంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుంది…. అంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. తరువాత సభాపతి శాసనసభను వాయిదా వేశారు.