Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి

Telangana development with TRS party

రైతులకు రాబోయే కాలంలో కరెంటు కష్టాలు ఉండవు
మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

మన తెలంగాణ/పాపన్నపేట : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే సమగ్రాభివృద్ధి సాధిస్తు న్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొడపాక గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, మిషన్‌కాకతీయ చెరువుల అభివృద్ధి పనులు, రైతు భవనం, బిసీ కమ్యూనిటీ భవనాలకు భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ పం చాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… నియో జకవర్గంలోనే మొట్టమొదటి సారిగా గ్రామ యూత్ సభ్యులు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా యూత్ సభ్యులను ఆమె అభినందించారు. రాష్ట్ర ప్రజ ల ఆకాంక్ష మేరకు సీఎం కెసిఆర్ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రా న్ని సాధించినట్లు ఆమె అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు సిం గూరు ప్రాజెక్టు నుండి ఘనపురం ఆనకట్టకు నీరు రావాలంటే రైతులకు ఎంతో ఇబ్బంది ఉండేదని ఆమె అన్నారు. పంటలు పండే విషయంలో రైతులు అనేక బాధలు పడిన సంఘటనలు గుర్తుచేసారు. గతంలో కరెం టు కష్టాలు ఎంతో ఉండేదని, రోడ్లపై ధర్నాలు, సబ్‌స్టేషన్‌ల ముట్టడి వం టివి రైతులు చేసేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కెసిఆర్ రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని 24 గంటల నిరంతర కరెంటును అందిస్తున్నారని, భవిష్య త్తులో కూడా కరెంటు కష్టాలు రాకుండా చేస్తున్నారన్నారు. గతంలో చె రువులు, కుంటలు పూడికతో నిండిపోయి నీరు ఉండేది కాదని, మిషన్ కాకతీయ పనుల ద్వారా చెరువులను పునరుద్దరించి నీండుకుండల్లా మార్చిన ఘనత సీఎం కెసిఆర్‌దేనన్నారు. చెరువులు నిండడంతో రైతులు మూడు పంటలను పండిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, ఆర్డీవో నగేష్, ఇరిగేషన్ ఇఇ ఏసయ్య, ఎంపిపి పవిత్రదుర్గయ్య, స్థానిక సర్పంచ్, ఎంపిటిసీలు, తహసీల్దార్ రాములు, ఎంపిడివో రాణి, జిల్లా రైతు సమన్వయ సమితీ అధ్యక్షులు సోములు, మార్కెట్ కమిటీ చైర్మేన్ రవీందర్‌నాయక్, వైస్ చైర్మేన్ గురుమూర్తిగౌడ్, వైస్ ఎంపిపి విష్ణువర్ధన్‌రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మేన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు బాపారావు, ఎంపిటిసీల ఫోరం అధ్యక్షులు సత్యనారాయణగౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు సొంగ దుర్గయ్య, సాయి రెడ్డి, కుమ్మరి జగన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments