Home వరంగల్ రూరల్ టిఆర్‌ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి

టిఆర్‌ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి

Telangana development with TRS Party

మన తెలంగాణ/ములుగు : వరంగల్ అర్బన్ జిల్లా ములుగు మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ గురువారం శంకుస్థాపన చేశారు. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న జీవంతరావుపల్లి ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంది. కనీస రోడ్డు సౌకర్యంలేని ఈ గ్రామాన్ని మంత్రి చందూలాల్ ప్రత్యేక చొరవతో గురువారం కోటి పదహారు లక్షలు మంజూరు చేయించి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహ్మద్‌గౌస్‌పల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అనతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక అబివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో 45 వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది పథకాలు పెట్టి తెలంగాణను ధనిక రాష్ట్రంగా చూడాలనే ఒక మంచి సకల్పంతో పని చేస్తున్నారని తెలంగాణ ప్రజలంతా కేసిఆర్‌కు రుణపడి ఉంటారని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా వృద్దులకు ఆసరా, ఒంటరి మహిళ పింఛన్, వికలాంగులకు పించన్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మహిళలు ప్రసూతి కోసం అమ్మ పథకం ద్వారా ప్రభుత్వ దావాఖానాలోనే ప్రసవం చెందేటట్టు ప్రసవించిన తర్వాత కేసిఆర్ కిట్టు ద్వారా నాణ్యమైన వస్తువులు అందించుట, ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందే విధంగా త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని రైతులకు 24 గంటల కరెంట్, అనేక సంక్షేమ హాస్టల్‌లను మంజూరు చేయించి కేజి టు పిజి లో భాగంగా పేద విద్యార్థులంతా సన్న బియ్యంతో ఆహారం, మౌళిక సదుపాయాలతో హాస్టల్ గదులు, సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2 లక్షల వరకు పేదలకు సహాయం, గత ఆంధ్ర పాలకుల హయాంలో అణిచివేయబడిన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకొని అనేక అభివృద్ది పనులు చేసి బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుతున్నారని ఆయన అన్నారు. రైతు బందు పతకం ద్వారా రైతులకు వారి వారి భూములను గుర్తించి పట్టాలు మంజూరి చేయడమే కాకుండా ఒక్కొక్క ఎకరానికి రూ.4 వేల చొప్పుల చెక్కులు అందిస్తున్నారని భూములకు పట్టా అనేది నిజాం పాలనలో జరిగింది. మళ్లీ కేసిఆర్ హయాంలోనే పేదలకు పట్టాలు అందజేస్తున్నామని మంత్రి అన్నారు. అబివృద్దిని ఓర్వలేక ప్రతి పక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతారని ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పివో చక్రధర్‌రావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మెన్ అజ్మీరా ప్రహ్లాద్, మండల రైతు సమితి కో ఆర్డినేటర్ కేశెట్టి కుటుంబరావు, ఎంపిపి మంజూల మురళీ, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గట్టు మహేందర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వేల్పూరి సత్యనారాయణ, గొర్రె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అద్భుతంగా ఉంది
జీవంతరావుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి చందూలాల్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చెందిన మహిళను కేసిఆర్ కిట్టు గురించి వివరణ అడుగగా మహిళా మాట్లాడుతూ గతంలో కంటే చాలా మెరుగ్గా ఉందని పురిటి నొప్పుల నుండి ఇంటికి వచ్చేంత వరకు ప్రైవేట్ వైద్యశాల కంటే బాగా సేవలు అందిస్తున్నారు. అమ్మ అనే పథకం ద్వారా ఇంటి నుండే దావాఖాన వరకు అంబులెన్స్‌లో ఉచితంగా దింపారని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. పేదలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని సమావేశంలో ఆమె తెలిపారు.