Home తాజా వార్తలు సర్ ప్రైజ్.. ‘తెలంగాణ దేవుడు’(ట్రైలర్)

సర్ ప్రైజ్.. ‘తెలంగాణ దేవుడు’(ట్రైలర్)

Telangana Devudu Movie

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఎక్కడ చూసిన ప్రచార రథాలే దర్శనిమిస్తున్నాయి.  ఈ తరుణంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా ‘తెలంగాణ దేవుడు’ ట్రైలర్ విడుదల కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఈ మూవీ సిఎం కెసిఆర్ బయోపిక్ అని సమాచారం. ఎన్నికల నగరా మోగిన ఈ తరుణంలో కూడా చడీచప్పుడు లేకుండా చిత్రం ట్రైలర్ విడుదల కావడం గమనార్హం. ఇక అన్నీ మూవీస్  ట్రైలర్స్‌కి భిన్నంగా ఏకంగా 6 నిమిషాలకు పైగా నిడివితో ట్రైలర్ రిలీజ్ కావడం విశేషం. హరీష్ దర్శకత్వంలో మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ‘తెలంగాణ దేవుడు’లో కెసిఆర్ పాత్రలో హీరో శ్రీకాంత్ నటించారు. మూవీలో విజయ్ దేవ్ అనే పేరుతో లీడ్ రోల్ పోషిస్తున్నారు శ్రీకాంత్. ఇతర ప్రధానపాత్రల్లో  సంగీత,  సుమన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, అజయ్, ప్రభాకర్, షియాజీ షిండే నటించారు.

Telangana Devudu Theatrical Trailer is Released

Telangana Breaking News