Home తాజా వార్తలు శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిజిపి

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిజిపి

TS-DGP

తిరుమల : తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి సతీసమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో డిజిపి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని డిజిపి తెలిపారు. ఇంతకాలం ఇన్‌ఛార్జి డిజిపిగా పని చేసిన మహేందర్‌రెడ్డి మంగళవారం పూర్తిస్థాయి డిజిపిగా నియామకమైన విషయం తెలిసిందే.

Telangana DGP Mahender Reddy Visited the Tirumala