Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు 10.2 శాతం : ఈటెల

eetela

హైదరాబాద్: ప్లానింగ్ శాఖ అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకానామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగము ముద్రించిన 2016 వ్యవసాయ గణాంకాలు, పరిశ్రమల వార్షిక సర్వే పుస్తకాలు, జిఎస్డిపి వివరాలు కలిగిన పలు పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో 10.2 శాతం వృద్ధి రేటు తెలంగాణ రాష్ట్రంలో నమోదైందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో 7.2 శాతం వృద్ధి రేటు  జాతీయ స్థాయిలో ఉందని వెల్లడించారు.

Comments

comments