Home కెరీర్ పోలీసుల అదుపులో తెలంగాణ ఎడ్‌సెట్ టాప్ ర్యాంకర్లు

పోలీసుల అదుపులో తెలంగాణ ఎడ్‌సెట్ టాప్ ర్యాంకర్లు

telanganaedcetహైదరాబాద్: టిఎస్ ఎడ్‌సెట్ ఎంట్రన్స్ టెస్ట్‌లో మొదటి రెండు ర్యాంకులు సాధించిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్‌సెట్ పరీక్షల్లో వీరద్దరూ అక్రమాలకు పాల్పడినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కృష్ణకాంత్, లింగస్వామి అనే ఇద్దరు సోదరులు వందకు వంద మార్కులు సాధించి తొలి, రెండు ర్యాంకులు సాధించారు. వీరిపై కన్వీనర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ తమకు బదులు ఇతరులతో పరీక్షలు రాయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.