Search
Wednesday 21 November 2018
  • :
  • :

74 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా

khuntia1

హైదరాబాద్: డిసెంబర్ లో జరగనున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి 74 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ఖరారు చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా తెలిపారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశం అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ 93 స్థానాల్లో పోటీ చేస్తుందని, మహాకూటమిలో మిత్ర పక్షాలకు 26 స్థానాలు కేటాయించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

టిడిపికి 14 స్థానాలు, టిజెఎస్‌కు 8 స్థానాలు, సిపిఐకి 3 స్థానాలు, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించినట్లు ఆయన చెప్పారు. రేపు (నవంబర్ 10) ఉదయం 74 అభ్యర్థులతో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేయనున్నట్లు కుంతియా తెలిపారు.ఈ నెల 11, 12 తేదీల్లో మరోమారు సమావేశమై మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేస్తామని పేర్కొన్నారు.

Telangana elections:congress to release first list on Nov 10

Comments

comments