Home తాజా వార్తలు ఆంధ్రలో కలిపే కుట్ర

ఆంధ్రలో కలిపే కుట్ర

Siddipet election campaign

 

ప్రజలను మోసం చేయడానికే లగడపాటి ఝూటా సర్వేలు
తెలంగాణ మేధావులూ మేల్కోండి… వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టండి- మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

మన తెలంగాణ/సిద్దిపేట: ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలపడానికి కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సిద్దిపేట పట్టణంలో ఆయన రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఏ జెంట్ అయిన లగడపాటి రాజగోపాల్ జూటా సర్వేలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చే యడానికి చూస్తున్నాడని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా పార్లమెంట్‌లో లగడపాటి రాజగోపాల్ పిప్ప ర్ స్ప్రేను ఉపయోగించి తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టకుండా అడ్డుతగిలి సభ వాయిదా పడేలా చేశాడని, అలాంటి వాడు మరో మారు సర్వేల పేరుతో ముందుకు వస్తున్నాడని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలను ప్రలోభాలకు గురిచేయడానికి ఆంధ్రా నుంచి భారీగా నోట్ల కట్టలను పంపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులంతా ఓటమి భయంతోనే ఇతర ప్రాంతాలలో ప్రచారం చేయడంలేదని అన్నారు. ఈ ఎన్నికలలో తెలంగాణ పౌరుషాన్ని చాటి ఓట్ల రూపంలో యావత్తు తెలంగాణ మేధావులు, ప్రజానీకమంతా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పి కొట్టేలా తీర్పునివ్వాలన్నారు. ఆంధ్రా నాయకత్వంలో పని చేసే కీలు బొమ్మల చేతిలో తెలంగాణ అధికారాన్ని కట్టబెట్టాలన్నదే చంద్రబాబు లక్షమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోతలు, వాతలే తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. చరిత్ర తిరగరాసే విధంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు కనీవిని ఎరగని రితీలో ఈ నెల 11న ఓటుతో తీర్పును ఇవ్వనున్నారని స్పష్టం చేశారు.

టిఆర్‌ఎస్ వందకుపైగా సీట్లతో అధికారంలోకి వస్తుందని, మళ్లీ రాష్ట్రానికి సిఎం కెసిఆర్ అవుతారని స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రచారంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవిందర్‌రెడ్డి, అత్తర్‌పటేల్, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, బాలకిషన్‌రావు, నయ్యర్ పటేల్, నందిని శ్రీనివాస్, పూజల వెంకటేశ్వర్‌రావు, పాల సాయిరాం, బర్లమల్లికార్జున్, గ్యాదరి రవిందర్, పల్లె వెంకట్‌గౌడ్, కెమ్మసారం ప్రవీణ్‌కుమార్, మల్యాల ప్రశాం త్, సాకి బాల్ లక్ష్మి ఆనంద్, దీప్తి నాగరాజు, గుడాల శ్రీకాంత్ గౌడ్, బూరవిజయ, నందాదేవి, పోన్నమల సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Elections: Harish Rao Election Campaign

Telangana Latest News