Home తాజా వార్తలు కేరళకు విద్యుత్ ఉద్యోగుల విరాళం రూ.9 కోట్లు

కేరళకు విద్యుత్ ఉద్యోగుల విరాళం రూ.9 కోట్లు

telangana Electricity Employees donated Rs 9 crores to Kerala

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమైందని, దేశమంతా కేరళకు అండగా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి విజ్ఞ్తప్తి చేశారు. జలప్రళయంలో చిక్కుకుపోయిన కేరళ వరద బాధితులకు అండగా ఉండేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం 9 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఉద్యోగులు సిఎండి ప్రభాకరరావు అధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి ఈ భారీ విరాళాన్నిఅందజేశారు. కేరళ బాధితుల కోసం తనవంతుగా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నానని మంత్రి జగదీశ్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడారు. కేరళకు ఇప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం తరుపున 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం అందజేశామన్నారు. కేరళ ప్రజలకు మనోధైర్యం కల్పించాలనే ముఖ్య ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలో ఎవరికైన కష్టాలు వచ్చిన ఆదుకునే వారు ఉన్నారనే మనోధైర్యం వారిలో కల్పించాలమని మంత్రి అభిప్రాయపడ్డారు. కేరళ ప్రజల వెంట తామున్నామని మంత్రి భరోసా ఇచ్చారు. కేరళకు విద్యుత్ స్తంభాలు, కరెంటు మీటర్లు, ఇతర విద్యుత్ పరికరాలు కూడా పంపబోతున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.