Search
Friday 21 September 2018
  • :
  • :

టిడిపితోనే తెలంగాణకు స్వాతంత్య్రం

  • నేడు నిర్మల్‌లో ప్రజా పోరు బాట
  • ఎల్ రమణ, రేవంత్‌రెడ్డిల రాక

TDP-MP-Nirmalఖానాపూర్ : ఎన్నికల ముందు అన్నీ పార్టీలు ప్రజలు కలిసి తెలంగాణ రాష్ట్రంను సాధించుకున్నామని ఎన్నికల ముందు కెసిఆర్ ఇచ్చిన హామి ఒక్కటి కూడ ఆమలు కాలేదని ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్‌లో ప్రజా పోరు బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజి ఎంపి రాథోడ్ రమేష్ తెలిపారు. ఆదివారం ఆయన ఖానాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కెసిఆర్ ఇచ్చిన హామిలు గద్దెను ఎక్కిన తర్వాత ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని అన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వంపై ఉద్యమం చేసి సాధించుకునేందుకే పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీనేనని టిడిపితోనే తెలంగాణలో స్వాతంత్య్ర వచ్చిందన్నారు. నేడు నిర్మల్‌లో జరిగే ప్రజా పోరుబాట కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, శాసన సభ పక్షనేత రేవంత్‌రెడ్డి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యు లు, రాష్ట్ర నాయకులు హాజరువుతున్నారని పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో నిర్మల్‌కు తరలివచ్చి పోరుబాట కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాకారం సంఘం అద్యక్షులు వెంకగౌడ్, టిడిపి నాయకులు గజాన్‌రావు, నరేందర్, కోండనారాయణ, శివ, గాజుల గంగన్న, శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.

Comments

comments