Home తాజా వార్తలు సినీ పేచీలపై కమిటీ

సినీ పేచీలపై కమిటీ

telangana governament  take Committee on film patches
telangana governament take Committee on film patches

మన తెలంగాణ / హైదరాబాద్: గత కొంత కాలంగా చిత్రసీమలో చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్ర  ముఖులతో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎఫ్‌డిసి చైర్మన్ రాం మోహన్‌రావు అధ్యక్షతన ఎఫ్‌డిసి, మా అసోసి యేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ 24 క్రాఫ్ట్ నుంచి ఎంపిక చేసిన వారు కమిటీలో సభ్యులుగా ఉంటారని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలుగు చిత్రసీమలో ఇటీవల జరిగిన పరిణామాలకు స్వస్తి పలకాలని, సినిమా పెద్దలు కూడా సహకరించాలని సూచించారు. చలనచిత్ర రంగంలోని పరిణామాలపై చర్చించేందుకు శనివారం హోం, కార్మికశాఖలతో పాటు షీ టిమ్స్, మా అసోసియేషన్, ప్రొడ్యూసర్ అసోసియేషన్ సభ్యులతో తలసాని శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ చలనచిత్ర రంగంలోని పరిణామాలపై సమగ్రంగా చర్చించామని, దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీ వారం, పది రోజుల్లో పది రకాల సమావేశాలను నిర్వహించి తుది నివేదికను అందిస్తుందన్నారు. నివేదికపై అన్ని వర్గాల వారితో చర్చించి మహిళా ఆర్టిస్టులకు తగిన రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటన జరిగిన తర్వాత ముందుగా ఛానళ్లకు వెళ్ళకుండా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసేలా తగిన సలహాలు, సూచనలను అందించాలని మా అసోసియేషన్ మంత్రికి విజ్ఞప్తి చేసింది.

సినిమా రంగంలో వివిధ పరిణామాలకు దారితీస్తున్న కో ఆర్డినేటర్ వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో మేనేజర్ స్థాయి వ్యక్తులను కొనసాగించాలని మంత్రి సూచించారు. ఇందుకు ప్రొడ్యూసర్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్లు చెల్లిస్తున్న రెమ్యునరేషన్ నేరు గా వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెమ్యునరేషన్‌ను షూటింగ్‌ల్లోనే అందించాలని, ప్రొడ్యూసర్స్ కార్యాలయా ల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఏదైనా అంశం మీడి యా ముందుకు వెళ్ళే ముందు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని రం గాల నుంచి ఒక్కొక్కరిని ఇం దులో సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మా అసోసియేషన్ కచ్చితమైన నిబంధనలను రూపొందించి అతిక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు మా కార్యదర్శి నరేష్ మంత్రికి వివరించారు. చిత్ర పరిశ్రమలోని కార్మికులకు గుర్తింపు కార్డుల పంపిణీతో పాటు ప్రభు త్వ పరంగా రావాల్సిన ఇఎస్‌ఐ, పిఎఫ్ కూడా వస్తాయని, ఆరిస్టుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వేధింపులు, మోసాలకు గురయ్యే మహిళలు ఈ సెల్ లేదా షీ టిమ్స్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లను నియంత్రించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు షూటింగ్ ప్రాంతా ల్లో కనీస వసతులు, ఆడిషన్స్ సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సినిమా వాళ్లంతా ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సినిమా ప్రతినిధులు పాల్గొన్నారు.