Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పసి పిల్లలకు సర్కార్ కానుక

12 రకాల సామాగ్రి ఉచిత పంపిణీకి నిర్ణయం
రూ. 3 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
తొలుత ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు

Baby

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలకు తెలంగాణ సర్కార్ కొత్త కానుక ప్రకటించింది. శిశు ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే సామాగ్రిని ఉచితంగా అందజేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. పిల్లలు పుట్టిన వెంటనే శిశువుకు చుట్టే వస్త్రాలతో పాటు బెడ్ షీట్, సబ్బు, నూనెలు, పౌడర్, మప్లరు, దోమ తెర వంటి 12 రకాల సామాగ్రిని ఉచితంగా అందించనున్నారు. ఇందుకు గానూ ఒక్కో కిట్‌కు రూ. వెయ్యి వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని ప్రాథమికంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు సరఫరా చేయాలని నిర్ణయించడంతో పాటు ఇందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లను కేటాయించినట్లు తెలిసింది.
మనతెలంగాణ/మంథని

Comments

comments