Home తాజా వార్తలు కేరళకు రాష్ట్రం చేయూత

కేరళకు రాష్ట్రం చేయూత

తక్షణ సాయంగా రూ.25 కోట్ల విరాళం
రూ. 52.50లక్షల విలువ గల 100 మెట్రిక్ టన్నుల పౌష్టికాహారమైన బాలామృతం తరలింపు
విజయ డెయిరీ నుంచి 20 టన్నుల పాల పొడి పంపిణీ
నేడు కేరళకు బయలుదేరనున్న నాయిని బృందం
మరింత సాయం అందించేందుకు తెలంగాణ సిద్ధం

Telangana Government Help to Flood hit Kerala

మన తెలంగాణ/హైదరాబాద్ : వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న కేరళకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తోంది. సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైన ఆహార, వస్తు సామాగ్రిని సరఫరా చేస్తోంది. కేరళను ఆదుకోవడంలోనూ అన్ని రాష్ట్రాల కంటే ముందువరుసలో నిలిచింది. అత్యధికంగా రూ.25కోట్లను విరాళంగా ప్రకటించింది. వర్షా లు సృష్టిస్తున్న ప్రళయానికి కేరళలో పెద్దఎత్తున ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లడంతో ఆ రాష్ట్రానికి పెద్దఎత్తున ఆపన్న హాస్తాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వరద ప్రభావిత ప్రాం తాల్లో చిక్కుకున్న బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున సాయం అందించాలని సిఎం కెసిఆర్ మంత్రులను, అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఇందులో భాగంగా కేరళ రాష్ట్రానికి మన రాష్ట్రం పక్షాన పెద్దఎత్తున సహాయ, సహకారాలు కొనసాగుతున్నాయి. తక్షణ సాయంగా రూ. 25 కోట్ల రూపాయల విరాళాన్ని సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ మొత్తాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమం త్రి పినరయి విజయన్‌కు అందజేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ తదితరుల బృందం ఆదివారం ఉదయం అక్కడకు బయలుదేరుతోంది. కేరళ సిఎంను కలిసి అన్ని విధాలుగా ఆదుకునేందుకు, సంపూర్ణ సహాయ సహకారాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని భరోసా ఇస్తారు. ప్రస్తుతం చేస్తున్న సాయం కంటే కేరళ ప్రభుత్వం కోరితే మరింత సాయం చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని వారు స్పష్టం చేస్తారు. కాగా నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ సంస్థ నుంచి చిన్నారులకు ఆహారం అందించడం కోసం రూ.52.50 లక్షల విలువ గల 100 మెట్రిక్ టన్నుల పౌష్టికాహారమైన బాలామృతాన్ని బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి రక్షణశాఖకు చెందిన ప్రత్యేక విమానం ద్వారా శనివారం ఉద యం 7.30 గంటలకు కేరళకు పంపారు. తాజాగా విజయ డెయిరీ నుంచి రూ. 50 లక్షల విలువైన 20 టన్నుల పాలపొడి పంపాలని కూడా సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేర కు 20 టన్నుల పాలపొడి కేరళకు పంపుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు.