Home నిర్మల్ బ్రాహ్మణ సమాజానికి సర్కార్ బాసట

బ్రాహ్మణ సమాజానికి సర్కార్ బాసట

Brahmin Communities

మనతెలంగాణ/బాసర : రాష్ట్రంలో నిరుపేద బ్రహ్మణులకు సహాయం అందిచేందుకు ప్రభుత్వం బుధవారం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బ్రహ్మణ సంక్షేమ పరిషత్తు ఛైర్మన్ కేవీ రమణ చారి ఆధ్వర్యంలో పేద బ్రహ్మణులకు సహయం అందిచేందుకు కార్యక్రమాలు ,రూపకల్పన చేసి మార్గ దర్శకాలు రూపోందించి దరఖాస్తులను త్వరలో ఆహ్వనించనున్నట్లు వారు పేర్కొన్నారు. గత కొన్నిసంవత్సరాల నుండి బ్రహ్మణ సమాజంలో నిరుపేద స్థాయి కి చెందిన కుటుంబాలు చాలీచాలనీ వేతనాలతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో గ్రామదేవతలతోపాటు, కొన్ని ఆలయా ల్లో ధూపదీప నైవైద్యాలు, ప్రత్యేకపూజలను నిర్వహిస్తున్న అర్చకులకు ఎటువంటి జీతభత్యలు లేకపో వడంతో వారి జీవితం ఆగమ్యగోచరంగా మారడంతో వారి సంక్షేమానికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సహాయ నిధి అందించలేదు.

సనాతన ధర్మానికి తమ వంతుగా నిరంతర సేవ చేయడంలో బ్రహ్మణులుండగా వారి కోసం నిత్యావసరాలకై గుడిలను ఎంచుకొని తమ బతుకుతోవా కొనసా గిస్తున్న నిరుపేద, పేద బ్రహ్మణులు జీవనం సాగిస్తుండగా వారి కోసం రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో కేవీ రమణ చారి అధ్యక్షతన బ్రహ్మణ సదారం కోసం పదికోట్ల నిధులను కేటాయించింది. బ్రహ్మణుల జనాభాను శా్రస్త్రీయంగా సర్వే జరుపనుంది. నిరుపేద బ్రహ్మణులకు కళ్యాణ లక్ష్మీతోపాటు, ఆసర పీంఛన్ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అర్హులైన బ్రహ్మణహోత్సహిక పారిశ్రామిక వేత్తనాలను ప్రోత్సహిం చాలని ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్య కోర్సులతో మెరిట్ సాధించి విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. అంతే కాకుండా మార్చి 31తేదిలోపు వీలైనంత నిరుపేద బ్రహ్మణులకు సహాయం అందే విధంగా కార్యచరణ రూపోందించి వారి కోసం డబూల్ బెడ్ రూం ఇండ్లను సైతం నిర్మించే విధంగా చూస్తామన్నారు. రాష్ట్రంలో 68 వేద పాఠశాలల అభివృధ్దికి ప్రయత్నం చేయాలని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్చకులు 400 , వేద పండితులు 220, ఉండగా బాసర ఆలయంలో అర్చకులు, వేద పండితులు 24 మంది పనిచేస్తున్నారు. వీరికి ఇకానుండి ట్రైజరీ ద్వార వేతానాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో కొందరు అర్చకులు, వేద పండితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మణ సమాజానికి చెందిన కొందరు ముఖ్యమంత్రి చేపట్టిన బ్రహ్మణసమాజ సేవ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు: రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంఘానికి నిధులు ఏర్పాటు చేయడంతో వారి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తునందున, రాష్ట్ర ముఖ్య మంత్రికి , బ్రహ్మణ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అదే విధంగా పలు ఆలయాల్లో బ్రాహ్మణుల కొరత ఉండ డంతో వారి నైపుణ్య వెలికి తీసి పలు ఉద్యోగాలుఖాళీ ఉన్న నేపథ్యంలో వాటిని త్వరలో భర్తిచేయాలన్నారు. – ప్రవీన్‌పాఠక్ (ఆలయ ప్రధానస్థానాచార్యులు ).

 మరిన్ని నిధులు కేటాయించాలి: తెలంగాణ ప్రభుత్వం బుధవారం జరిగిన ప్రత్యేక కమీటిలో పది కోట్లు నిధులు కేటాయించడంతో బ్రాహ్మణ స మాజం ఇకానుండి అభివృధ్ది చెందు తుందన్నారు. బ్రాహ్మణ సమాజంలో నిరుపేదలను గుర్తించి వారికి ప్రత్యేక పథకాలతోపాటు మరిన్ని నిధులు కేటా యించి బ్రాహ్మణ సంక్షేమానికి పాటుప డాలన్నారు. ప్రభుత్వం కొన్ని చోట్ల వేద పాఠశాలలను ఏర్పారిచి దానితోపాటు సంగీత పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. – సంజీవ్‌పూజారి ( ఆలయ ప్రధాన అర్చకుడు ).