Home రాష్ట్ర వార్తలు విద్యావాలంటీర్ల వేతనాలు పెంపు : కడియం

విద్యావాలంటీర్ల వేతనాలు పెంపు : కడియం

Kadiyam-Srihari

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యావాలంటీర్ల వేతనాలు రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందని, డిఎస్సి విధివిధానాలపై కసరత్తు జరుగుతోందన్నారు. త్వరలో డిఎస్సిపై నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. టెట్‌ నిర్వహణ విషయమై న్యాయశాఖను సంప్రదిస్తున్నాం.. డీఎస్సీ, టెట్‌ ఒకేసారి నిర్వహించాలా? లేదా? అనే విషయాన్ని ఆలోచిస్తున్నామని కడియం తెలిపారు.  ఉపాధ్యాయుల బదిలీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, అసలు ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు.