Home తాజా వార్తలు తెలంగాణ ప్రభుత్వం ఔట్ ఆఫ్ కవరేజ్: కోదండరాం

తెలంగాణ ప్రభుత్వం ఔట్ ఆఫ్ కవరేజ్: కోదండరాం

Kodanda-ram1

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉందని జెఎసి చైర్మన్ కోదండరాం విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రావడంలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా అమలు కావడం లేదని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఆకాశంలో, ఖర్చులు పాతాళంలో ఉన్నాయని చెప్పారు. కొత్త ధర్నా చౌక ఎక్కడుందో ఇంకా ఎవరికీ తెలియదన్నారు. ధర్నాలు, నిరసనలు ఉండకూడదనే ధర్నా చౌక్‌ను తరలించిందని ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. కెసిఆర్ ఫోటోలకు పాలాభిషేకం చేయడానికి మాత్రం అనుమతులు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.