Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు

Telangana-Awards-to-Woman

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో కృషిచేసిన 20 మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన వారిని ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు రూ. లక్ష నగదు రివార్డుతో సత్కరించనుంది. అవార్డులకు ఎంపికైన వారిలో విద్య, వైద్య, క్రీడా, వ్యవసాయం, సాహిత్యం, సమాజసేవ, సినీ తదిరత రంగాలకు చెందినవారు ఉన్నారు. క్రీడారంగంలో ఇటీవల జిమ్నాస్టిక్స్ ప్రపంచలో రజత పతకం సాధించిన అరుణారెడ్డి అవార్డుకు ఎంపికైంది. విద్యా రంగంలో కవిత దరియాణి, సినిమా రంగంలో నందినీ రెడ్డి, వైద్యంలో సత్యలక్ష్మీ, సాహిత్య రంగంలో చక్రవర్తుల లక్ష్మీనరసింహ,సిరి, నాట్యంలో మంజులా శ్రీనివాస్, సంగీతం- నిత్యసంతోషిణి, చిత్రకళలు- కవితా దేవుష్కర్, జానపద సాహిత్యం-ఝాన్సీ, ఉద్యమ గానం- ఎడునూరి పద్మ, మహిళా వ్యాపార వేత్త- రాజ్యలక్ష్మీ, పాత్రికేయం- లతాజైన్, సౌమ్యనాగపురి, వృత్తి సేవలు- మెట్రో రైలు మొదటి లోకో డ్రైవర్ సుప్రియ, ఢిల్లీలో ఆర్‌టిసి డ్రైవర్- సరిత, మహిళా సాధికారత- యాప భద్రమ్మ, వ్యవసాయం- బొగ్గం జయమ్మ, ప్రజాప్రతినిధుల విభాగంలో కొత్తపల్లి గ్రామసర్పంచ్- శైలజ, సామాజిక సేవలో గండ్ర రమాదేవికి అవార్డులు దక్కాయి.

Comments

comments