Search
Wednesday 26 September 2018
  • :
  • :

సాగు, తాగు నీటితో పాటు పెట్టుబడి ఇస్తున్నాం : కెటిఆర్

ktr

రాజన్నసిరిసిల్ల: దేశంలోనే రైతులకు సాగునీరు, త్రాగునీరుతో పాటు పెట్టుబడి అందిస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. జిల్లాలోని చొప్పడండి నియోజకవర్గం బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో మంగళవారం జరిగిన రైతు బంధు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ ప్రసంగించారు. బోయిన్ పల్లి మండలంలో చెరువులు, రోడ్లు అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు సూచించారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువుల్లో మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు నింపేందుకు కృషి చేస్తున్నమన్నారు. ఇంతవరకు రాష్ట్రంలోని రైతులను ఎవరు పట్టించుకోలేదన్నారు. 2009లో కాంగ్రెస్ నాయకులు 9 గంటలని.. 6 గంటలని చెప్పిసరిగా కరెంట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త అయ్యేది ఇప్పుడు కరెంట్ పోతే వార్తని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రైతులకు కరెంట్, విత్తనాల కష్టాలు తీరాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బిడ్డ కావడంతో రైతుల కోసం మంచి పథకాలను ప్రవేశ పేడుతున్నారని తెలిపారు. 86 సంవత్సరాల భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో చేసి, 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రేనని కెటిఆర్ కొనియాడారు. గతంలో పాలకులు రూ. 200 పింఛన్ ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పెట్టేవారన్నారు. తెంగాణ ప్రభుత్వం రూ. 1000 పింఛన్ ఇస్తుందని తెలిపారు. రైతు బంధు ద్వారా కెసిఆర్ రైతులకు మరింత చేరువయ్యారని చెప్పారు. రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించడంపై కెటిఆర్ ఫైర్ అయ్యారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టమన్నారు. దేశంలో సరికొత్త హరిత విప్లవానికి తెలంగాణ ఆదర్శం అవుతుందని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments