Home తాజా వార్తలు మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం..

మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం..

ktr

హైదరాబాద్: మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎఫ్‌ఎల్‌ఒటిఎస్‌ఐఐసి ఇండస్ట్రియల్ పార్క్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు స్థలాల కేటాయింపు పత్రాలు అందజేశారు. కాలుష్య రహిత కంపెనీలు నెలకొల్పిన మహిళా పారిశ్రామికవేత్తలకు సర్టిఫికెట్లను కెటిఆర్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యర్ధ పదార్థాలతో కాలుష్య రహితంగా నూతన ఉత్పత్తులు తయారు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తల 200 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కుల కోసం కేటాయించామని చెప్పారు. మరో రెండు ఇండస్ట్రియల్ పార్కులకు స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీఇచ్చారు.