Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులకు సమానం: నాయిని

Nayani-Narsimhareddy

హైదరాబాద్: ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులకు సమానమని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతో నేరాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.

నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమెరాల పనితీరు భేషుగ్గా ఉందని హోంమంత్రి చెప్పారు. చైన్ స్నాచర్లపై పిడి యాక్టులు పెడుతుండటంతో గొలుసు దొంగల ఆగడాలను ఆపగలిగారని అన్నారు. పోలీసులు ఎంత కష్టమైనప్పటికీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. సర్వీసు రివాల్వర్లతో కాల్చుకొని చనిపోవడం బాధాకరమన్నారు.

Comments

comments