Home రంగారెడ్డి అభివృద్ధి పథంలో తెలంగాణ

అభివృద్ధి పథంలో తెలంగాణ

Telangana in development path

మన తెలంగాణ/ కుల్కచర్ల: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంతో పాటుగా ఇప్పాయిపల్లి, లింగంపల్లి, మక్తవెంకటాపూర్ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. కుల్కచర్ల మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో షెడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించగా ఇప్పాయిపల్లిలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, డబుల్ బెడురూం ఇళ్ళ నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లింగంపల్లిలోని వాల్యనాయక్ తాండాలో బిటిరోడ్డును ప్రారంభించడం జరిగింది. మక్తవెంకటాపూర్ గ్రామంలో బిటిరోడ్డుకు శంకుస్థాపనను నిర్వహించి గ్రామంలో సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా అబివృద్ధి కార్యక్రమాల నిర్వహాణ కోనసాగుతున్నదని, ప్రతి ఒక్కరికి కూడ అర్థికపరమైన సహకారాన్ని అందిస్తూ వారి ఉన్నతికి దోహాదం చేస్తున్నామని పుట్టిన పాపకు మొదలు ప్రమాదవశాత్తు మరణించిన వరకు ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు పథకాలను రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు. పేద వర్గాలకు ఇబ్బందిగా మారిన పెళ్ళిళ్ళకు లక్షరూయాయలను అందిస్తూ , రైతుబందు ద్వార రైతులకు పెట్టుబడినిస్తూ పేదప్రజలకు అపద్బాందవులుగా ప్రభుత్వం ఉన్నదని ఆయన పెర్కొన్నారు. తాండలకు గ్రామాలుగా మార్చుతామని ఇచ్చిన హామిని నేరవేర్చిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. నూతన గ్రామపంచాయతీల ద్వార యువకులకు రాజకీయ అవకాశాలు కూడ రావడం జరుగుతుందని యువత అబివృద్ధికి సైతం ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఆయన పెర్కొన్నారు. వికారాబాద్‌ను చార్మినార్ జోన్‌లో చేర్చాలని తాము సిఎంకు విన్నవించామని స్థానిక నేతలు అతి చేస్తున్నారని ఆయన పెర్కొన్నారు. వికారాబాద్ జిల్లా రైతు సమన్వయ సమితి అద్యక్షులు కొప్పుల మహేష్ రెడ్డి, సర్పంచులు నర్సింలు, అంజనేయులు, సంద్యరాణిఆశోక్, ఎంపిటిసి బుడ్డమ్మరాందాస్, చిన్నరాములు, జాను, కిషన్, పులిరాములు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.