Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రియల్ ఎస్టేట్‌కు తెలంగాణ అనుకూలం

ఢిల్లీ సదస్సులో మంత్రి కెటిఆర్
మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ

ktrహైదరాబా ద్: రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి హై దరాబాద్ దేశంలోకెల్లా అను వైన నగరమని రా్రష్ట్ర మున్సి పల్, పట్టణాభివృద్ధిశాఖ మం త్రి కె.తారకరామారావు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన నేషనల్ రియల్ ఎస్టే ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సద స్సులో మంత్రి కె.తారకరామారావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలు గృహ నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాల్లో మంచి విధానాలను జాతీయ స్థాయిలో తీసుకువచ్చేందుకు కృషి చేయడమే ఈ సద స్సు ముఖ్య ఉద్దేశమన్నారు. గృహ నిర్మాణం దానంతట అదే ఒక రంగం కాద ని, ఇతర రంగాల అభివృద్ధి జరిగినప్పుడే గృహ నిర్మాణ రంగంలో ఉపాధి కల్పనలో పురోగతి కనిపిస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రా థమికంగా పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టిందన్నారు. టిఎస్-ఐపాస్ వల్ల పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్న విషయాన్ని సదస్సులో వివరించానని కెటిఆ ర్ తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఆయా రంగాల్లో నిపుణుల డిమాండ్ మేరకే ఏ కార్యక్రమమైనా తీసుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని ఆందులో భాగంగానే గతంలో ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ సంస్థలతో నిర్వహించిన స మావేశంలో 40 డిమాండ్లకు గాను 31ని ఆమోదించారని గుర్తు చేశారు. జూ న్ 2 నుండి మున్సిపాలిటీలు, హైదరాబాద్‌లో అన్ని రకాల అనుమతులను సరళతరం చేశామన్నారు. బెంగళూరు, పూణే నగరాల కన్నా రెండింతల మౌళి క సదుపాయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయన్నారు. సదస్సులో పాల్గొ న్న అనంతరం మంత్రి కెటిఆర్ కేంద్ర టైక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి రశ్మి వర్మను కలిసి తెలంగాణలో ఏర్పాటు చేయబోయే క్లస్టర్స్ గురించి చర్చించారు. అనం తరం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అ య్యారు. గతంలో ఇచ్చిన ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్‌లను కేంద్ర మంత్రికి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వరంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన లెదర్ పార్కు ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రితో చర్చించానని కెటిఆర్ తెలిపారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Comments

comments